in ,

85 ఫిర్యాదులు-న్యాయం చేస్తాం. జిల్లా ఎస్పీ.

నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన  స్పందన కార్యక్రమంలో ఫిర్యాదిదారుల నుంచి నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి IPS  85  ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండీ విచ్చేసిన ఫిర్యాదిదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో  స్వయంగా ఫోన్ లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు .

చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ,స్పందన  ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని ,స్పందన  పిర్యదుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించరాదని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో  మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు.

ఫిర్యాదులలో కొన్ని ……..

1) ఉమ్మడి కుటుంబం కు సంబంధించి 1.35 ఎకరాల భూమి ఉంది. నేను కూలి పనుల నిమిత్తం బెంగళూరుకు వలస వెళ్లి తిరిగి వచ్చేసరికి నా రెండవ కుమారుడు పూల.లక్ష్మన్న మాకు తెలియకుండా మొత్తం భూమిని అమ్మి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో అని మమ్మల్ని చంపుతానని నా కుమారుడు పూల. లక్ష్మన్న బెదిరిస్తున్నాడని మరియు అన్యాయంగా కొనిన  నల్లగట్ల భాస్కర్ రెడ్డి పైన, అమ్మిన పూల లక్ష్మన్న పైన చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయండని బత్తులూరు గ్రామానికి చెందిన పూల.సుబ్బమ్మ జిల్లా ఎస్పీ ఫిర్యాదు చేశారు.

2) కాంట్రాక్ట్ పద్ధతిలో రెవెన్యూ విభాగంలో, వెటర్నరీ విభాగంలో, హెల్త్ విభాగంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి దాదాపు 5 మంది నుండి పది లక్షల రూపాయలు తీసుకుని కర్నూలుకు చెందిన మూర్తి మోసం చేసి నాడని మాకు న్యాయం చేయండి అని అహోబిలం కు చెందిన M.సునీత జిల్లా ఎస్పీ ఫిర్యాదు చేశారు.

3) డోన్ టౌన్ కు చెందిన పవన్,కమలేష్,చంపత్ లాల్ అనువ్యక్తులకు 05 లక్షలు అప్పుగా ఇచ్చాను.కొద్ది రోజులు వడ్డీ బాగానే ఇచ్చారు.తర్వాత డబ్బులు అడుగగా అక్కడినుండి పారిపొయ్యరు.తర్వాత వారు వచ్చీ మీ అప్పుకు బదులుగా మీ షాపులో పనిచేసి అప్పు కడతామనగా మేము నమ్మి షాపులోని స్టాక్ అప్పజెప్పగా వారు దానితో పారిపోయ్యారని నాకు న్యాయం చేయండి అని డోన్  పట్టణానికి చెందిన S.నాజీమ జిల్లా ఎస్పీ  ఫిర్యాదు చేశారు.  

NOTE:- నంద్యాల జిల్లా ప్రజలకు తెలియజేయడం ఏమనగా పోలీస్ స్పందన ఫిర్యాదుల గురించి సమాచారం తెలుసుకోవడానికి ,మరియు సెంట్రల్ కంప్లైంట్ సెల్
(CCC) గురించిన సమాచారం తెలుసుకొనుటకు శాంతిభద్రతలకు సంబంధించిన విషయాల కొరకు నంద్యాల జిల్లా ఎస్పీ ని సంప్రదించాలి లేదా మాట్లాడాలి అనుకున్న ఫిర్యాదుదారులు 9154987020 నంబర్ కు ఫోన్ చేసి గాని లేదా మీ యొక్క సమస్యలకు సంబంధించిన ధ్రువపత్రమును వాట్సాప్ ద్వారా గాని తెలియజేయవచ్చును.దూర ప్రాంతాలనుండి వచ్చువారు వ్యయప్రయాసలతో జిల్లా పోలీసు కార్యాలయానికి రాకుండా ఈ సదుపాయం ఉపయోగించుకోవాలని  మీ యొక్క సమస్యలకు సంబంధించిన ధ్రువపత్రమును వాట్సాప్ ద్వారా గాని తెలియజేయాలని వాటిపై ప్రత్యక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలియజేశారు.

నంద్యాల జిల్లా ఎస్పీ స్పందకు వచ్చిన ఫిర్యాదిదారులకు ఓంకారం ధేవస్థానం వారిచే  భోజన వసతి ఏర్పాటు చేసినారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల DSP మహేశ్వర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ DSP జె.వి సంతోష్ , SI హరినాద్ రెడ్డి పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Allagadda CM news

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author

ఉత్తమ ఉపాధ్యాయుడిగా బాల గుర్రప్ప

ఉద్యోగాలు లేక అల్లాడుతున్న యువత