ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అర్హులకు ఉచితంగా అందజేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బహదూర్‌పల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు వివేక్, మాధవరం కృష్ణారావులతో కలిసి ప్రారంభించారు.
