బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చాలా రోజులుగా సైలెంట్‌గా ఉంటున్నారు. దీంతో.. పార్టీ నాయకత్వానికి ఆయనకు చెడిందని.. పార్టీ మారుతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా.. ఆ వార్తలపై రఘునందన్ రావు స్పందించారు. తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే.. వచ్చే ఎన్నికల్లోనూ దుబ్బాక నుంచే బరిలో ఉండబోతున్నట్టు స్పష్టం చేశారు.