*ఏ.పి ఎంసెట్ మూడవ విడత కౌన్సిలింగ్ నిర్వహించాలి*.
*ఆర్.పి.ఎస్.ఎఫ్ (RPSF) రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ డిమాండ్*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ రాసిన విద్యార్థులకు మూడవ కౌన్సిలింగ్ నిర్వహించాలని రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన (RPSF) రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి , విద్యాశాఖ మంత్రి స్పందించి 1వ, 2వ కౌన్సిలింగ్ నిర్వహించిన ప్రభుత్వం మూడవ కౌన్సిలింగ్ నిర్వహించాలని, చాలామంది విద్యార్థులు మూడవ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఒకటి ,రెండు కౌన్సిలింగ్లో హాజరైన విద్యార్థులకు మరియు ఇతర ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు కూడా మూడవ కౌన్సిలింగ్లో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవలం ఒకటి రెండు కౌన్సిలింగ్లలో 77% మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయని మిగతా 27,590 సీట్లు ఖాళీగా ఉన్నాయని , 13వేల మందికి పైగా విద్యార్థులు మూడవ కౌన్సిలింగ్ నిర్వహిస్తే వారికి న్యాయం జరుగుతుందని తెలిపారు .దీనిపైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కోరడం జరిగిందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి ఇంజినీరింగ్ చదవాలి అనుకున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మూడవ కౌన్సిలింగ్ నిర్వహించి విద్యార్థులకు అండగా నిలవాలని కోరారు.
This post was created with our nice and easy submission form. Create your post!