పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందచేయాలని సంకల్పముతో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి కుటుంబం ఆరోగ్యముగా సంతోషంగా ఉండాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి వార్డు సచివాలయంలో కూడా అత్యంత నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందచేయాలని సంకల్పముతో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమము ఈరోజు ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని 25వార్డు క్రాంతి నగర్ సచివాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో దాదాపుగా 600మంది ప్రజలు పరీక్షలు చేయించుకుని మందులు తీసుకున్నారు.ఇందులో ప్రముఖ డాక్టర్లు హర్షిత, నితీష్ రెడ్డి, రవళి, రామకృష్ణ మూర్తి, తులసి కుమార్, పాటుగా వార్డు కౌన్సిలర్ శ్రీమతి సిద్ధా కృష్ణవేణి, ఆదోని టౌన్ కన్వీనర్ వెల్లాల మధుసూదనశర్మ, వార్డు కన్వీనర్లు జికెరాజు, గోవిందు, సిద్ధమల్లిఖార్జున, వీరేష్, అంజి,లాలిపాప్, కార్తీక్, రాజు,శీనా మొదలైన వారు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!