డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం అక్టోబర్ మాసంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండల స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలు వివరాలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. .అక్టోబర్ 4వ తేదీ బుధవారం అయినవిల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలోను, అక్టోబర్ 6వ తేదీ శుక్రవారం రాయవరం ఎంపీడీవో కార్యాల యంలోను అక్టోబర్ 11వ తేదీ బుధవారం మండపేట మండల ఎంపీడీవో కార్యాలయంలోను, అక్టోబర్ 13వ తేదీ శుక్రవారం ఐ. పోలవరం మండల ఎంపీడీవో కార్యాలయంలోను అక్టోబర్ 18 వ తేదీ బుధవారం రావులపాలెం మండల ఎంపీడీవో కార్యాల యంలోనూ అక్టోబర్ 20వ తేదీ శుక్రవారం కే గంగవరం మండల ఎంపీడీవో కార్యాలయంలోను, అక్టోబర్ 25వ తేదీ బుధవారం అల్లవరం మండల ఎంపీడీవో కార్యాలయంలోను 27వ తేదీ శుక్రవారం ఆత్రేయపురం మండల ఎంపీడీవో కార్యాలయంలోను స్పందన జగనన్నకు చెబుదాం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కావున ఆయా మండలాల పరిధిలో అర్జీదారులు ఈ యొక్క సమా చారాన్ని గుర్తించుకుని ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక స్పందన జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకొని తమ తమ సమస్యలను స్పందన జగన న్నకు కార్యక్రమo దృష్టికి తెచ్చి పరిష్కార మార్గాలు కోరాలని ఆయన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
This post was created with our nice and easy submission form. Create your post!