in , ,

రాజమండ్రి ఆస్పత్రి లో నకిలీ ధృవపత్రాలు!

రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా: కొందరు కిందిస్థాయి సిబ్బంది వసూళ్లకు అలవాటు పడి వివిధ ధ్రువపత్రాల కోసం ఆసుపత్రికి వచ్చే వారిని మోసగించి నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆసుపత్రిలో వైద్యుల సంతకాలు ఫోర్జరీ చేసి స్టాంపులు వేసి ఒక్కో ధ్రువపత్రానికి ఒక్కో ధర నిర్ణయించి దండుకుంటున్నారు. జీజీహెచ్‌కు రోజూ సుమారు 50 మంది వరకు ధ్రువపత్రాల కోసం వస్తుంటారు. ఇందులో మెడికల్‌ లీవ్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, కొత్త కళాశాలలు, వర్సిటీల్లో సీట్లు దొరికిన విద్యార్థులు దరఖాస్తులపై సంతకాల కోసం వస్తుంటారు. వీరినే లక్ష్యంగా చేసుకుని కొందరు సెక్యూరిటీ, పారిశుద్ధ్య సిబ్బంది రెచ్చిపోతున్నారు. క్యాజువాలిటీ కేంద్రంగా ఈ దందా సాగుతున్నా పర్యవేక్షణ లేక యథేచ్ఛగా నకిలీ ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆసుపత్రి అభివృద్ధి సొసైటీకి చలానా తీసి ఫిట్‌నెస్‌ కోసం వైద్యులతో ధ్రువీకరణ పొందిన తరువాత పత్రం జారీ చేయాల్సి ఉన్నా అనధికారికంగా క్యాజువాలిటీ వైద్యులతో సంతకాలు పెట్టించడం, విధుల్లో లేని వైద్యుల సంతకాన్ని ఫోర్జరీ చేసి జారీ చేయడం అలవాటుగా మార్చుకున్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

సీఎం జగన్ దృష్టికి గిరిజన ప్రాంత సమస్యలు

దొంగగా మారిన సాప్ట్ వేర్ ఉద్యోగి