విశాఖ. వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఇచ్చిన హమీలను అమలు చేయకుండా, వారిపై నిర్భంధాన్ని ప్రయోగించడాన్ని సిపిఎం విశాఖ జిల్లా 78వవార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు తీవ్రంగా ఖండిరచారు. తక్షణమే నిర్భందచర్యలు ఆపి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసారు. ఈమేరకు సెప్టెంబరు 25 చలో విజయవాడ కార్యక్రమంపై జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్భందాన్ని ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా జివిఎంసి గాంధీవిగ్రహం వద్ద నిరసన తెలియజేయడానికి వచ్చిన అంగన్‌వాడీలను పోలీసులు అక్రమంగా అరెస్టుచేసి పోలీస్ బేరక్స్‌లో నిర్భంధించింది. ఇది తెలుసుకొని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి.గంగారావు, జిల్లా కమిటీ సభ్యులు వి.కృష్ణారావులు పోలీస్ బేరక్స్ వద్దకు వెళ్ళి తమ పోరాటానికి సంఫీుభావం తెలియజేసారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అంగన్‌వాడీలపై యాప్‌లు పెట్టి కక్షసాధింపు చర్యలు పూనుకోవడాన్ని తీవ్రంగా ఖండిరచారు. ఇచ్చే జీతాలు తక్కువ పని భారమెక్కువైందని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని ఎమ్మెల్యేలకు, ఎంపిలకు లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి ప్రజలసొమ్మును దిగమింగుతున్నారన్నారు. ప్రజలకు సేవలందిస్తున్న ఆశ, అంగన్‌వాడీ, మిడ్డేమీల్, ఆర్‌పి, విఓఏలు వంటి స్కీంవర్కర్లకు మాత్రం జీతాలు పెంచకుండా, రెగ్యులరైజ్ చేయకుండా తీవ్ర మానసిక వేదనకు గురిజేస్తుందన్నారు. కార్మికుల డిమాండ్ పరిష్కారం చేయండని నిరసన తెలియజేసే హక్కును సైతం నేడు వైసిపి ప్రభుత్వం హరిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్భంధాన్ని మానుకొని తక్షణమే అరెస్టు చేసిన వారిని భేషరతుగా విడుదల చేయాలని, డిమాండ్లను పరిష్కారం చేయాలన్నారు. సిపిఎం కార్మికుల పోరాటానికి మద్దతు ఉంటుందని తెలిపారు.
This post was created with our nice and easy submission form. Create your post!