గురు న్యూస్ విశాఖపట్నం :కసింకోటలో మళ్ల బుల్లిబాబు ఆధ్వర్యంలో సుమారు 85 లక్షల రూపాయలు వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శనివారం ప్రారంభించారు. స్థానిక కస్పా వీధి నుంచి రామాలయం వరకు పది లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. అలాగే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కసింకోట నాలుగవ సచివాలయం పరిధిలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇంటర్నల్ రోడ్స్, కమ్యూనిటీ హాల్ను మంత్రి ప్రారంభించారు. కుమ్మరి వీధి శివాలయం ప్రాంతంలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను, వేగి ఆదినారాయణ ఇంటి నుంచి దుర్గాలమ్మ తల్లి ఆలయం వరకు 10 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అయన తెలిపారు. అటు తరవాత కసిం కోట సచివాలయం-3 పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కేటాయించిన 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇంటర్నల్ రోడ్స్, కాలువలను మంత్రి ప్రారంభించారు. అలాగే కోళ్ల మధుo నుంచి సాలి నూకరాజు ఇంటి వరకు 10 లక్షల రూపాయలతో నిర్మించిన కాలువలను, శిల్పరశెట్టి వారి వీధిలో ఇంటర్నల్ కాలువలను మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ ఇన్ ల్యాండ్ వాటేర్వేస్ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, జడ్పీటీసీ శ్రీధర్ రాజు,కశింకోట ఎంపీపీ కలగా లక్ష్మీ గున్నాయ నాయుడు, అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, కశింకోట మండల పార్టీ అధ్యక్షుడు మలసాల కిషోర్, అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, గొల్లవిల్లి శ్రీనివాస రావు, వైస్ ఎంపీపీలు నమ్మి మీనా, పెంటకోట జ్యోతి , సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబెర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!