కొండా.. కోనల్లో.. లోయల్లో..

ఎన్నెన్నో కొండలు.. అన్నింటా అందాలు
ప్రకృతి సౌందర్యం పాడేరు ఏజెన్సీ సొంతం. .
‘అందని మిన్నే ఆనందం..
అందే మన్నే ఆనందం…
అరె భూమిని చీల్చుకు పుట్టే పసిరిక ఆనందం..
మంచుకు ఎండే ఆనందం.. వాటికి వానే ఆనందం.. అరె ఎండకి వానకి రంగులు మార్చే ప్రకృతి ఆనందం..’ అని ఓ సినీకవి ప్రకృతి విశిష్టతను ఎంతో గొప్పగా వర్ణించారు.కొండా.. కోనా.. వాగు.. వంక.. ప్రకృతి రమణీయతతో కట్టిపడేస్తున్నాయి. తొలకరి జల్లుల తర్వాత కురిసే వర్షాలతో పచ్చని చీరను కప్పుకున్న అటవీ అందాలు మైమరపింపజేస్తున్నాయి. కొండవాగుల్లో జలపాతాలను తలపించే నీటి ప్రవాహాలు అబ్బురపరుస్తున్నాయి.డుంబ్రిగుడ మండలంలోని అరకు సంత నుంచి సొవ్వ పంచాయతీ పరిధిలో గల కమలబంధ గ్రామం వరకు కొండ ప్రాంతంలో ఎన్నెన్నో అందాలు. అరకు నుంచి అనంతగిరి బొర్రాగుహాలు వరకూ దట్టమైన అటవీ ప్రాంతంలో తారురోడ్డుపై ప్రయాణం వెన్నెల్లో హాయ్ హాయ్ అన్నట్టు సాగుతుంది. రోడ్డుకు రెండువైపులా పొడవైన చెట్లు, ఎతైన కొండల మధ్య ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది.అల్లూరి ఏజెన్సీ ప్రాంతం ప్రకృతి సొబగులతో కనువిందు చేస్తోంది.
[zombify_post]