తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. శ్రీవారి ఆలయానికి వెళ్లే నడకదారిలో బుధవారం తెల్లవారుజామున మరో చిరుత బోనులో పట్టుబడింది. కాగా, నడకదారిలో వారం రోజులుగా అటవీశాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారు..
వివరాల ప్రకారం.. తిరుమల నడకదారిలో మరో చిరుత బోనులో చిక్కింది. చిరుత సంచారాన్ని గుర్తించిన అధికారులు బోనులు ఏర్పాటు చేయడంతో తాజాగా చిరుత బోనులో చిక్కింది. అయితే, చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే తాజాగా చిరుత చిక్కడం విశేషం. ఇక, చిరుతను జూపార్క్‌కు తరలించడానికి అటవీశాక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో ఇప్పటి వరకు ఆరు చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించారు..
[zombify_post]