స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే చంద్రబాబుపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో పీటీ వారెంట్ దాఖలైంది. ఇపుడు తాజాగా ఫైబర్ నెట్ స్కాంలో కూడా పీటీ వారెంట్ జారీ కావడం, ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించడం సంచలనం రేపింది. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా పేర్కొంటూ పిటీషన్ ను దాఖలు చేశారు.
