కొత్త పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. వినాయక చతుర్థి రోజు కొత్త పార్లమెంటులోకి అడుగుపెట్టాం. ‘కొత్త సభలోకి ఎంపీలందర్ని ఆహ్వానిస్తున్నా. ఆధునికత అద్దంపట్టడంతో పాటు చరిత్ర ప్రతిబింబించేలా పార్లమెంట్ భవనం నిర్మించుకున్నాం. ప్రపంచమంతా మనల్ని మిత్రుడుగా చూస్తోంది. భారత్ విశ్వ మిత్రగా అవతరిస్తోంది. భారత్ ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగింది. త్వరలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరిస్తాం’ అంటూ ప్రసంగం కొనసాగించారు.
