లోకేష్ నూ జగన్ విడిచిపెట్టేలా లేడు. ఇప్పట్లో చంద్రబాబు నాయుడు ని బయటికి రానివ్వడు.ఆ పార్టీ కొత్త నాయకురాలిని తెరపైకి తెచ్చింది. తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఏకైక ఆశాదీపం బ్రాహ్మణి. కచ్చితంగా ఆమెను రంగంలోకి దింపుతారు” రాజమండ్రిలో క్యాండిల్ ర్యాలీలో నారా బ్రాహ్మణి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మిని మాట్లాడిన మాట తీరు టీడీపీ నేతలను ఆకట్టుకోవడం జరిగింది. టీడీపీకి కొత్త కెరటం దొరికిందన్న చర్చకు సోషల్‌మీడియాలో తెరలేచింది. ప్రధానంగా తన భర్త లోకేష్‌ను కూడా అరెస్టు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయినా తామేమీ భయపడేది లేదన్న నారా బ్రాహ్మిని తెలుగు ప్రజలంతా తమకు అండగా ఉండాలంటూ చేసిన అభ్యర్థన, జాతీయ మీడియాలో ఎక్కడా తడబడకుండా, ఎదురు ప్రశ్నలతో తండ్రి చంద్రబాబు అరెస్టును ప్రశ్నించిన వైనం అందరినీ ఆకట్టుకుంది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు తర్వాత, ఆయన తనయుడు లోకేష్‌ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఏ శుక్రవారం అర్ధరాత్రో, ఏ శనివారం ఉదయమో లోకేష్‌ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం, గత కొద్ది రోజులుగా జరుగుతోంది.