డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
కొత్తపేట గ్రామం లో ఘనంగా మోడీ 72 వ జన్మ దినోత్సవ వేడుకులు బీజేపీ జిల్లా కార్య వర్గ సభ్యులు సంపతి కనకేశ్వరావు స్వగృహుమ్ లో ఈ వేడుకులు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయుకుల సలాది రామ కృష్ణ పాల్గుణి ప్రసంగించారు.
ప్రతి యేడాది సామాజిక కార్యక్రమాలలో బీజేపీ శ్రేణులను భాగస్వామ్యం చేశారన్నారు. యుగానికి ఒక యుగ పురుషుడు పుడతారంటారు.. అతనే నరేంద్ర మోదీ అంటూ చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వంలో దేశం ఎంతో పురోగతి చెందుతుందన్నారు. ఆర్ధిక వ్యవస్థ కుదేలైనా తిరిగి గాడిలో పెట్టిన ఘనత మోదీకే దక్కుతుందని అన్నారు. ప్రజల కోసం, దేశం కోసం ఆలోచన చేసే మోదీ నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సంపతి కనకేశ్వరావు మాట్లాడుతూ దేశాభివృద్ధి, ప్రజలందరి సంక్షేమం కోసం పరితపిస్తున్న మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్య క్రమం లో వృద్ధులకు వికలాంగులకు పండ్లు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కుడుపూడి దావీదు,కోటిపల్లి సుబ్రహమణ్యం,నల్ల శ్రీ రామప్రసాద్,బొరుసు పెద్దకాపు,కంఠంశెట్టి వెంకటేశ్వర్లు,కంఠం సెట్టి సత్యప్రసాద్ ,తదితరులు పాల్గున్నారు.
[zombify_post]