భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పాత చర్ల శివాలయం గుడిలో మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాన్ని పాత చర్ల కమిటీ వారు ప్రతిష్టించడంతో మండలంలో పలువురు పెద్దలు పుర ప్రముఖులు కమిటీ వారిని ప్రశంసిస్తున్నారు…పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా వినాయక చవితి పండుగను మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని తయ్యారు చేయించి శివాలయం గుడిలో ప్రతిష్టించడంతో మండల వాసులు పూజ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులైన ఆలం ఈశ్వర్,బోల్ల వినోద్,శివ,సాగర్ లు గత పది రోజులు నుంచి విగ్రహ తయారీకి కృషి చేసి మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు తమ కమిటీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకునట్లు తెలిపారు.
[zombify_post]