- చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా ఉమ్మడి జిల్లాల్లో నిరాహార దీక్షలు, ఆందోళనలు భారీ ఎత్తున జరిగాయి.చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా ఉమ్మడి జిల్లాల్లో నిరాహార దీక్షలు, ఆందోళనలు భారీ ఎత్తున జరిగాయి. శుక్రవారం బొబ్బిలిలో తెలుగు యువత చేపట్టిన దీక్షలకు నియోజకవర్గ ఇన్ఛార్జి బేబినాయనతో కలిసి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు చెత్తతో సంపద సృష్టిస్తే.. ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి పన్ను వేస్తున్నారని మండిపడ్డారు. తెదేపా హయాంలో సిమెంటు రోడ్లు వేస్తే, ప్రస్తుతం గుంతలు పూడ్చలేని పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు, జగన్ పాలన మధ్య వ్యత్యాసాన్ని వాడవాడలా చాటాలని పిలుపునిచ్చారు. మేధావులు, యువత బాబుకు అండగా నిలవాలని కోరారు. అనంతరం 'బాబుతో నేను' ఫ్లెక్సీపై సంతకాల సేకరణ
చేపట్టారు.
[zombify_post]
