విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యశాఖ అధికారి జగదీశ్వరరావు కలిసి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు మాట్లాడుతూ పేదల నివసించే కాలనీలలో సీజనల్గా వచ్చే వ్యాధుల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్స్ కు వస్తే మందులు బయట కొనుక్కోవాలని చెప్పడం సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దానికి మూల్యం చెల్లించక తప్పదని తెలిపారు. మందుల సమస్య పరిష్కరించకపోతే ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రావణ్ , నాయకులు శరత్ రామస్వామి పాల్గొన్నారు.
[zombify_post]