in , , ,

ఎస్సీ వర్గీకరణ మాదిగల జన్మ హక్కు

  • ఎస్సీ వర్గీకరణ మాదిగల జన్మ హక్కు.

  • ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని రిలే నిరాహార దీక్షలు.

  • సంఘీభావం తెలిపిన 23వ వార్డు దళిత కౌన్సిలర్ వల్దాస్ సౌమ్య జానీ.

ఎస్సీ వర్గీకరణ మాదిగల జన్మహక్కు అని కౌన్సిలర్ సౌమ్య జానీ అన్నారు.ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ నాయకులు పట్టణ సెక్రటరీ చింత వినయ్ బాబు అధ్యక్షతన చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారం 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు 23వ వార్డు దళిత కౌన్సిలర్ వల్దాస్ సౌమ్య జానీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఇచ్చిన హామీని బిజెపి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేపడుతామని 2014 ఎన్నికల్లో బిజెపి హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం హామీని నెరవేర్చలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణను చేపట్టాలని అప్పుడే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందన్నారు. 

ఎస్సీ వర్గీకరణ చేపట్టకపోవడంతో మాదిగలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అసమాన తలను తొలగించేందుకు వర్గీకరణను చేపట్టాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ సాధించేంతవరకు ఉద్యమాలు చేస్తామన్నారు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ పుట్టల మల్లేష్, పట్టణ ఇంచార్జ్ దైద వెంకన్న,బొజ్జ వెంకన్న, దాసరి వెంకన్న,సూర్యాపేట మండల అధ్యక్షులు తాటిపాముల నవీన్,చింత అర్జున్,సాంబయ్య, చిలక మహేష్, పిడమర్తి వల్దాస్ సాలమ్మ,నాగమణి తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

మట్టి వినాయకులను వినియోగించాలి

అభివృధి కి మారుపేరు జగన్ : చిర్ల