డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం పెదపళ్ళ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్, ఏడిద సత్య శ్రీ మెహర్ ప్రసాద్, సొసైటీ డైరెక్టర్ నెక్కంటి వెంకట్రాయుడు (బుజ్జి), వైసీపీ గ్రామ అధ్యక్షుడు గొడవర్తి వెంకటేష్, కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా నెక్కంటి (బుజ్జి) మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పింఛన్లు మంజూరు చేసేవారని నేడు రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రాజకీయాలు కులమతాలతో పనిలేకుండా పెన్షన్లు మంజూరు చేయడం జరుగు తుందని అన్నారు. అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా అర్హతే ప్రామాణికంగా పథకాలను అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ అనతి కాలంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు.రాజకీయాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు మంజూరుచేసి వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే విధంగా సీఎం జగన్ పరిపాలన కొనసాగిస్తున్నారని పెదపళ్ళ సొసైటీ డైరెక్టర్ నెక్కంటి వెంకటరాయుడు (బుజ్జి) అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కంటి పరిమళాదేవి ప్రకాష్, మేడవరపు లక్ష్మణరావు, దొడ్డ సుబ్బారావు,వాలంటర్లు, సచివాలయ సిబ్బంది, వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
