పాడేరు, అల్లూరి జిల్లా: ఈనెల 15 వతేదీలోగా ఫారం 6,7,8 ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుండి రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో ఓటరు నమోదు, తొలగింపులు, వంద ఏళ్లు పైబడిన ఓటర్లు, ఒకే నివాసంలో ఉన్న 10 మంది ఓటర్లు పరిశీలన, పి. ఎం. కిసాన్, జనన దృవీకరణ పత్రాలు జారీపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎ ఇ ఆర్ ఓ లు ఓటరు ఆన్ లైన్ నమోదు ప్రక్రియపై ప్రత్యేక చొరవ చూపించాలని స్పష్టం చేసారు. నిర్దేశించిన సమయానికి అన్ని పనులు పూర్తి చేయాలని చెప్పారు.
మండల వ్యవసాయాధికారులు, తాహశీల్దారులు సమన్వయంతో పని చేసి అర్హత కలిగిన రైతులకు రైతు భరోసా పి. ఎం. కిసాన్ పథకాలను అందించాలని అన్నారు. 389 గ్రామాల్లో అసైన్డ్ ల్యాండ్ వెరిఫికేషన్ చేయాల్సి ఉందని, వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకి జనన దృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు జారీ చేయాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు, ఐటిడి ఏ పిఓ వి. అభిషేక్, డి ఆర్ ఓ పి. అంబేద్కర్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్. బి. ఎస్.నంద్, జిల్లా ఉద్యాన వన అధికారి రమేష్ కుమార్ రావు, సర్వే సహాయ సంచాలకులు వై. మోహనరావు, 22 మండలాల రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]