నర్సీపట్నం: సెప్టెంబర్ నెలలో ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నర్సీపట్నం బాల వినాయక స్వామి ఆలయంలో ఆదివారం ఉత్సవ రాటను ఏర్పాటు చేశారు. ఆలయ చైర్ పర్సన్ దేవత అరుణ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు గురుస్వామి గణేశ్వర స్వామి ఉత్సవ రాటకు పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నవరాత్రి పూజలకు అంకురార్పణ జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గణేష్ స్వాములకు ఒడి ఏర్పాటు చేశారు.
[zombify_post]