సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామశివారులో హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగిందనీ సత్తుపల్లి పోలీసులు శనివారం రాత్రి తెలిపారు. క్రైమ్ నెంబర్ 221/23 u/s 302, 201 r/w 34 IPC కు సంబంధించిన నిందితుల వివరాలు ఇలా వున్నాయి.
ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం, లింగగూడెం గ్రామానికి చెందిన చిమట రాము (46) ఏ-1, మృతుడి భార్య చిమట సత్యవతి (30) ఏ-2, ఎన్టీఆర్ జిల్లా చాట్రాయి మండలం, మంకోలు గ్రామానికి చెందిన శేషగిరిరావు కుమారుడు గంపా జోజిబాబు (23) ఏ-3 గా పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. చిమట రాము s/o వెంకటేశ్వరావు, వయస్సు-46 సంవత్సరాలు, కులం-యాదవ, వృత్తి-వ్యవసాయం R/O లింగగూడెం గ్రామం, చింతలపూడి మండలం, ఏలూరు జిల్లా కు మరియు అదే గ్రామానికి చెందిన వాళ్ళ దూరపు బందువు అయిన చిమట సత్యవతి w/o కేశవరావు, యాదవ అనునామెతో సుమారుగా ఒక సంవత్సరం క్రితం పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి ఇతను ఆమెతో శారీరక సంబందం పెట్టుకున్నాడు. ఇతనికి స్నేహితుడు అయిన గంపా జోజిబాబు s/o శేషగిరిరావు R/O మంకోలు గ్రామం, చాట్రాయి మండలం అనునతడు మద్యవర్తిగా ఉండేవాడు. అంతేకాకుండా ఎవరికి అనుమానం రాకుండా ఇతను సత్యవతి ఫోన్ లో మాట్లాడుకోడానికి జోజిబాబు తన పోన్ ద్వారా కాన్ఫరెన్స్ పెట్టేవాడు. ఇతను కు, సత్యవతికి ఉన్న అక్రమ సంభదం గురించి ఆమె భర్తకు తెలియడంతో గత కొన్ని రోజుల నుండి సత్యవతికి మరియు ఆమె భర్త కేశవరావుల మద్య గొడవలు జరుగుచున్నాయి. అప్పటి నుండి సత్యవతి చిమట రాముతో ఇలా చెప్పింది. మన విషయం నా భర్త కేశవరావుకు తెలిసిన దగ్గర నుండి నన్ను ప్రతిరోజూ మానసికంగా, శారీరకంగా కొట్టి చిత్రహింసలు పెడుతున్నాడని, మనం ఎలాగైనా నా భర్తను చంపి మనకు అడ్డు తొలగించుకుందామని, అప్పుడు మనకు ఎవరూ అడ్డు చెప్పేవాళ్లు ఉండరు అని చెప్పింది. ఇక అప్పటి నుండి చిమట రాము ఎలాగైనా కేశవరావుని చంపి తమకు అడ్డు తొలగించుకొవాలని, అందుకు వాళ్ళకు మద్యవర్తిగా ఉంటున్న అతని స్నేహితుడు జోజిబాబు కూడా వాళ్ళతో ఫోన్ లో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ కేశవరావుని చంపితే మీకు అడ్డు ఉండదని చెప్పేవాడు.
పథకం ప్రకారమే…
అప్పటి నుండి సత్యవతి, చిమట రాముకు ప్రతిరోజూ పోన్ చేసి నా భర్త ను ఎలాగైనా చంపమని చెప్పేది. అప్పటి నుండి చిమట రాము సమయం కోసం ఎదురుచూస్తుండగా మృతుడు కేశవరావు ది.01-09-2023 నాడు రాత్రి సుమారు 7గంటల సమయంలో చిమట రాముకు పోన్ చేసి నీ వల్ల మా ఇంట్లో గొడవలు జరుగుచున్నాయి అని చెప్పాడు. చిమట రాము అతనితో నా వల్ల తప్పు జరిగింది క్షమించు అని నమ్మించి, మనం ఒకసారి కలుద్దామని అని చెప్పి, లింగగూడెం గ్రామంలో మర్రిచెట్టు వద్దకు కేశవరావును రమ్మని చెప్పడు. చిమట రాము వెంటనే తన మోటార్ సైకిల్ పై మర్రి చెట్టు దగ్గరకు వచ్చి కేశవరావు తన మోటార్ సైకిల్ పై ఎక్కించుకుని వెల్లుచున్నాడు. మార్గమద్యలో అనగా లింగగూడెం గ్రామ శివారున గల చిమట రాముకు చెందిన పామాయిల్ తోటలోకి పధకం ప్రకారం తీసుకెళ్లి అతని పై చేకత్తి తో దాడిచేసి చంపడం జరిగింది . క్రిందపడ్డ కేశవరావు ఇంకా ప్రాణాలతో ఉండడంతో అక్కడే ఉన్న తెల్లని ప్లాస్టిక్ కవర్ ను అతని మెడ, తల చుట్టూ చుట్టి అట్టి కవర్ ఊడకుండా డ్రిప్ లాడర్ పైపు తో మెడకు చుట్టినాడు. అప్పుడు అతడు పూర్తిగా ఊపిరి తీసుకోవడం మానివేసినాడు. ఇట్టి శవం చిమట రాము తన తోటలో ఉంటే తనపై అనుమానం వస్తుందని అనుకుని, కేశవరావు శవాన్ని తన మోటార్ సైకిల్ పై వెనుక పడుకోబెట్టుకొని కాళ్ళు చేతులు నేలను తాకుచుండగా, కాళ్ళు చేతులను డ్రిప్ లాడర్ పైపు తో కట్టివేసి, కాళ్ళు చేతులు నేలను తాకాకుండా పైపుతో గట్టిగా లాగి కట్టి క్రింద ఆనకుండ అక్కడి నుండి చిమట రాము తోటకి దగ్గరలో గల సత్తుపల్లి మండలం పాకలగుడెం గ్రామ పంచాయితీ సత్యనారాయణ పురం కి చెందిన నీలపాల చందర్ రావు పామాయిల్ తోటలో శవాన్ని పడవేసినాడు. కేశవరావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించి హత్య కేసు నమోదు చేశారని తెలిసి చిమట రాము కు భయం వేసి లింగగూడెం గ్రామ పెద్ద మనుషుల వద్దకు వెళ్ళి తాను చేసిన తప్పును ఒప్పుకుని నన్ను కాపాడమని కోరగా, వారు చిమట రాముని ఈ రోజు సత్తుపల్లి పోలీసు స్టేషన్ కు తీసుకొని వచ్చి సరెండర్ చేసినారు, చేసిన నేరం ఒప్పుకొన్న తరువాత లింగగూడెం గ్రామం వెళ్ళి చిమట సత్యవతిని, మంకొల్లు గ్రామం వెళ్ళి గంప జోజిబాబుని అదుపులోకి తీసుకొన్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 3 సెల్ ఫోన్లలను, ఒక మోటార్ సైకిల్ ను, హత్యకు ఉపయోగించిన చే కత్తి ని స్వాదిన పరుచుకోవడం జరిగింది. ఈరోజు ముగ్గురు నిండుతులను అరెస్టు చేసి రీమాండుకు తరలించడం జరిగింది.
[zombify_post]