జగిత్యాల పట్టణ ఎల్ఎ.ల్ గార్డెన్స్ లో తెలుగు భాషా అభ్యసనాభివృద్ది సమితి జగిత్యాల ఆధ్వర్యంలో ప్రజా కవి,పద్మ విభూషణ్ కాళోజీ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనీ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ఫోరమ్ ఫర్ తెలుగు ( LIFT ) బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,జెడ్పీ ఛైర్మెన్ దావా వసంత. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ …ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాషా అణచి వేతకు గురైందిని,భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారి కృషి తో తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలు కాపాడే ప్రయత్నం జరుగుతోందన్నారు.తెలుగు భాష రక్షణకు ఫోరం ఏర్పాటు చేయటం ఆనందంగా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో తెలుగు భాష ను రక్షించాలని ప్రయత్నం వచ్చింది అంటే కొంత భాదాకరం అని అన్నారు.దేశంలో ఆంగ్ల మాధ్యమం రావడం,ప్రపంచీకరణ తో తెలుగు భాషా ఆదరణ కొంత తగ్గుతూ వచ్చింది.తెలుగు భాష తల్లి పాల వంటిది.ప్రతి తల్లి దండ్రులు ,ఉపాద్యాయులు పిల్లలకు తెలుగు భాషా ప్రాధాన్యం,తెలుగు సంస్కృతి నీ తెలియజేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం లో విద్య బోధన ఉన్నా తెలుగు లో సైతం పార్యపుస్తకాల ముద్రణ జరిపారు అని కేసిఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అనీ అన్నారు.హైదరాబాద్ లో కాళోజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.కవులను సన్మానించడం జరిగింది అని అన్నారు.రాష్ట్రంలో కాళోజీ నారాయణ రావు పేరు పైనా హెల్త్ యూనివర్సిటీ సైతం ఏర్పాటు చేయటం జరిగింది అని అన్నారు.
[zombify_post]