సోమవారం జరిగే ఉచిత కంటి ఆపరేషన్లు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని
ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు,ప్రధాన కార్యదర్శి,ప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
భద్రాచలం పాత ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా గల అల్ పెన్షనర్స్&రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యాలయం నందు వరంగల్ శరత్ మ్యాక్సీవిజన్ ఐ ఆసుపత్రివైద్యులచే కంటి పరీక్షలు నిర్వహించి కేటారక్టు ఆపరేషన్ కుఅర్హులైన వారిని అదేరోజు వారి వాహనాలలో తీసుకువెళ్లి ఉచితంగా ఆపరేషన్స్ చేసి మరల తిరిగి ఆల్ పెన్షనర్స్ ఆఫీసు వద్ద దింపుతారని తెలిపారు.
వీరికి ఉచిత మందులు,భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తారు. శిబిరంకు వచ్చునపుడు పెన్షనర్లు హెల్త్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని దీనికి రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు, ఉద్యోగులు,ఉపాధ్యాయులు. అర్హులు,మరియు ఆరోగ్య శ్రీ కార్డులు కలిగిన వారికికంటిలో దుర్మాంసముఉన్న వారికి కూడా ఉచతంగా ఆపరేషన్లు చేస్తారు.జర్నలిస్టులుహెల్త్ కార్డులు కలిగిన వారందరికీ ఉచితంగా కేటరాక్ట్ ఉన్న వారికి ఆపరేషన్లు చేస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో కోశాధికారి
డి.క్రిష్ణమూర్తి,నాళం సత్యనారాయణ, మంగయ్య,నారాయణ,టి.శివ ప్రసాద్,రాజబాబు, సుబ్బయ్య చౌదరి,జి.మురళీ కృష్ణ,మాది రెడ్డి రామ్మోహన్ రావు,ఐలయ్య,యేటకాని సత్య నారాయణ,డి.ఎస్ రెడ్డి. రాంబాబు,అక్కయ్య బి. రాజు ,చుక్కా రాంబాబు,బందు వెంకటేశ్వరరావు అధ్యక్షులు ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్
[zombify_post]