in ,

కొండగట్టు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సస్పెన్షన్

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అనువంశిక ధర్మకర్త(ఫౌండర్ ట్రస్టీ) తిరుక్కోవెళ మారుతిస్వా మిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్త ర్వులు జారీ చేసినట్లు ఈవో వెంకటేశ్ తెలిపారు. గత నెల 9న హుండీ లెక్కింపు సందర్భంగా మారుతిస్వామి చేతివాటం ప్రద ర్శించారని ఆలయ ధర్మకర్త జున్ను సురేందర్, స్థానిక సర్పంచి బద్దం తిరుపతిరెడ్డి ఆగస్టు 16న ఆలయ ఈవో వెంకటేష్ కు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు దేవాదాయశాఖ కమిషనరు అనిల్ కుమార్ ను కలిసి మళ్లీ ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 19న దేవాదాయశాఖ ఏడీసీ కృష్ణవేణి కొండగట్టుకు వచ్చి విచారణ జరిపి అందుకు సంబంధించిన సీసీ కెమెరా పుటేజీలను స్వాధీనం చేసుకుని వెళ్లారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫౌండర్ ట్రస్టీ మారుతిస్వామిని సస్పెండ్ చేస్తూ దేవాదాయశాఖ కమిషనరుకు ఆదేశాలు జారీ చేయ డంతో శుక్రవారం కార్యాలయానికి ఉత్తర్వులు అందినట్లు ఈవో తెలిపారు. మారుతిస్వా మిని ఆలయ పాలకవర్గం నుంచి సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వుల మేరకు ఆయ నను వివరణ కోరనున్నట్లు పేర్కొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Gopi

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author

ద్వారకాతిరుమల అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు

ఉచిత కంటి ఆపరేషన్లు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి