56వ వార్డ్ లోని శ్రీకృష్ణ యాదవ సంఘం కమిటీ ఆహ్వానం మేరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు .
అదేవిధంగా ఉదయం 10.30 గంటలకు 61 వ వార్డు మల్కాపురం గొల్ల వీధి శ్రీ విజ్ఞానమండలి యాదవ సంఘం ఆహ్వానం మేరకు శ్రీకృష్ణాష్టమి వేడుకలు పాల్గొన్నారు .
అదేవిధంగా 61 వ వార్డు వెంకన్నపాలెం, శ్రీ మురళీకృష్ణ యాదవ సంఘం కమిటీ ఆహ్వానం మేరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.59 వ వార్డు శిరిడి సాయిబాబా దేవాలయం శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.మధ్యాహ్నం 12:30 గంటలకు 91 వార్డు పాత గోపాలపట్నంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ(గొల్ల వీధి) ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు.కృష్ణుడు ఒక మార్గదర్శని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు, అధ్యక్షులు, ఇన్చార్జిలు వైఎస్ఆర్సిపి నాయకులు, వివిధ ఆలయాల కమిటీల సభ్యులు, వైఎస్ఆర్సిపి అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
## శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు, చైర్మన్, విశాఖ డెయిరి మరియు సూక్ష్మ చిన్న మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APMSMEDC) మరియు సమన్వయకర్త, విశాఖ పశ్చిమ నియోజకవర్గం
[zombify_post]