రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెప్టెంబర్15వ తేదీన నిర్వహించబోయే టెట్ పరీక్షలను పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఐ.డి. ఒ సి. లోని తన ఛాంబర్ లో టెట్ పరీక్షల నిర్వహణ,ఏర్పాట్ల పై జిల్లా అదనపు కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ టెట్ పరీక్షలను అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.ఈ పరీక్షలు 15వ తేదీన ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ పేపర్ పరీక్షలు నిర్వహించనున్నామన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి పేపర్ కు 3378 మంది విద్యార్థులు,రెండోవ పేపర్ 2937 మంది హాజరుకానున్నారని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లాలోనీ సిరిసిల్ల పట్టణంలో మొదటి పేపర్ వ్రాసేవారికి 15 సెంటర్లు, సెకండ్ పేపర్ వ్రాసేవారికి కొరకు 14 సెంటర్లు ఏర్పాటు చేసామన్నారు.ఈ నెల 15వ తేదీన నిర్వహించే పరీక్షలో హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష ప్రారంభం కావడానికి ముందే పరీక్ష కేంద్రం లో ఉండాలని సూచించారు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్పరికరాలు, సెల్ ఫోన్లు తీసుకు రావద్దని సూచించారు.హాల్ టికెట్ లలో ఏమైనా తప్పులుంటే జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయంలో సరైన సరైన పత్రాల తో హాజరై సవరించుకోవాలని సూచించారు.పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేవిధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీసు శాఖ కు సూచించారు. పరీక్షా కేంద్రములో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సెస్ అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాల నిఘా లోనే పేపర్లు తెరవాల్సి ఉంటుందన్నారు. ఆర్టీసీ అధికారులు పరీక్ష సమయాలను అనుసరించి ఆర్టీసీ బస్సులను సరిపడా నడపాలన్నారు. మున్సిపల్ అధికారులు పరీక్ష కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాల సమకూర్చాలన్నారు.ఈ సమన్వయ సమావేశంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, ప్రభుత్వ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ అజీమ్ , సెస్ ఎండీ ఎస్ సూర్య చంద్ర రావు,జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ రజిత, ఆర్టీసీ, పోలీస్, సెస్, ట్రేజరీ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
[zombify_post]