లక్కవరపుకోట *
*ఖాసాపేటలో బాబు ష్యురీటి – భవిష్యత్తుకు గ్యారెంటీ & పల్లె ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న నియోజవర్గ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి*
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు శృంగవరపుకోట నియోజకవర్గంలోని లక్కవరపుకోట మండలం, ఖాసాపేట గ్రామంలో గల క్లస్టర్ -7, యూనిట్ -23లో మహాశక్తిలో భాగంగా ఖాసాపేట గ్రామ సర్పంచ్ కోళ్ల భూపాల్ నాయుడు గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు ష్యురీటి – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం మరియు పల్లె ప్రజావేదిక కార్యక్రమంలో *శృంగవరపుకోట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి* పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ ఇంచార్జ్ కోళ్ల లలిత కుమారికి మహిళలు, ప్రజలు & పార్టీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా ఘనంగా స్వాగతం పలికారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలన పోవాలి…సైకిల్ పాలన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో ఉంటారని ఆమె అన్నారు.
మహాశక్తి పేరుతో ప్రకటించిన పథకాలు మహిళా సాధికారత చేకూర్చడం, తల్లికి వందనం కింద బిడ్డలను చదివించేందుకు ఒక్కొక్కరికి రూ.15,000 ఇవ్వనున్నాము. ఆడబిడ్డ నిధి ద్వారా 18 పైబడి 60 సంవత్సరాలలోపు వయసున్న ప్రతీ మహిళకు నెలకు రూ.1,500 ఆర్ధిక సహాయం కలిపించనున్నాము. ఆపడుచులకు జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నాము. పెరిగిన వంట గ్యాస్ ధరల భారం తగ్గించడానికి ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గారు తాజాగా అవసరమైతే నాలుగో గ్యాస్ సిలిండర్ ను కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. వీటినంటితోపాటు సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారికీ అండగా ఉండేందుకు సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక బరోసా చేస్తామని, యువగళం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 ఆర్థిక సహాయం, ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అంతేకాకుండా బీసీలకు రక్షణకు ప్రత్యేక చట్టం, ఇంటింటికి ఉచితంగా తాగునీటి కుళాయిలు వంటి సంక్షేమ పథకాలు అమలుపరుస్తామని అన్నారు. ఈ సందర్భంగా మహాశక్తిలో భాగంగా రాష్ట్ర ప్రజల కోసం విడుదల చేసిన మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంచుతూ, ప్రకటించిన ప్రతీ లబ్దిదారులకు బాబు ష్యురీటి – భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాల గురించి క్లుప్తంగా వివరించారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
*ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యాదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్, కే.కనకమహాలక్ష్మి, కే.కృష్ణవేణి, కె.వెంకటలక్ష్మి, టి.రవణమ్మ, సిహెచ్.పద్మ, కే.లక్ష్మి, జి.సన్యాసమ్మ, బి.సత్యవతి, దాకమరి కాంతమ్మ, వై.రమణమ్మ, ఎం.సత్యవతి, పి.మంగ, లక్కవరపుకోట మండల పార్టీ అధ్యక్షులు చొక్కాకుల మల్లు నాయుడు, మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, 7వ క్లస్టర్ ఇంఛార్జ్ & మాజీ ఎంపీపీ కొల్లి వెంకటరమణ మూర్తి, 23వ యూనిట్ ఇంఛార్జ్ సంగం వేంకట సూర్య సతీష్ కుమార్, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ కొట్టాన విజయ్ కుమార్, ఎల్.కోట మండల తెలుగుయువత అధ్యక్షులు శ్రీనాథు రాజేష్, 125వ బూత్ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు, 126వ బూత్ కన్వీనర్ కొట్టాన శ్రీనివాసరావు, ఎల్.కోట గ్రామ కమిటీ అధ్యక్షులు పుట్టా శ్రీనివాసరావు, పట్టాలు మాస్టర్, అక్కిరెడ్డి వెంకటరమణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత, అధిక సంఖ్యలో మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.*
[zombify_post]