చించినాడ బ్రిడ్జి దాటి రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన యువనేత నారా లోకేష్.
జనసంద్రంగా మారిన చించినాడ బ్రిడ్జి పరిసరాలు.
గోదావరి నదిలో బోట్లపై యువగళం జెండాలతో యువనేతను స్వాగతించిన మత్స్యకారులు.
మాజీమంత్రి, రాజోలు ఇన్ చార్జి గొల్లపల్లి సూర్యారావు నేతృత్వంలో యువనేతకు ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు.
నినాదాలు, కేరింతల నడుమ యువనేతకు కోనసీమ ప్రజల అపూర్వస్వాగతం.
భారీ గజమాలలు, బాణాసంచా మోతలతో యువనేతకు బ్రహ్మరథం పట్టిన జనం.
యువనేత లోకేష్ పై పూలవర్షం కురిపిస్తూ నీరాజనాలు పడుతున్న అభిమానులు.
యువనేతకు స్వాగతం పలికిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు హరీష్ మాధుర్, చిక్కాల రామచంద్రరావు, జ్యోతుల నవీన్, ఆదిరెడ్డి వాసు, రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు.
[zombify_post]