నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రావణమాసం 4వ శుక్రవారం పురస్కరించుకొని దేవస్థానం అధికారులు వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వరలక్ష్మీ వ్రతానికి శ్రీశైలంలో ఉన్నటువంటి చెంచు ముత్తైదులను 450 ముత్తయిదు మహిళలతో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా మిగతా మహిళలు కూడా 35 ముత్తయిద మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీశైలం నియోజకవర్గం తో పాటు, ఆత్మకూరు, బండి ఆత్మకూరు, శ్రీశైలం, ఈ ప్రాంతాల నుంచి మహిళలు కూడా అధిక సంఖ్యలో వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు వరలక్ష్మీ వ్రతం అనంతరం వారికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక క్యూ లైన్లు దర్శనం నిర్వహించడం జరిగింది అదేవిధంగా అన్నపూర్ణ భోజన శాలలో వారికి భోజన వసతి ఏర్పాటు చేశారు కుంకుమార్చన, స్వామి అమ్మవార్ల ప్రసాదమును , మహిళలకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ( ఐ టి డి ఏ ) అధికారులు వరలక్ష్మీ వ్రతం కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ వారు ( ఐ టి డి ఏ ) ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు వారి సిబ్బంది ఎంతగానో సహకరించారు
[zombify_post]