డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ విద్యాసంస్థలను పూర్తిగా ప్రభుత్వం పరం చేసే వరకు ఉద్యమిస్తామని AFDT విద్యాసంస్థల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మలికిపురం నుండి కత్తిమండ MLA గారి క్యాంప్ కార్యాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయం జరిగే వరకూ పోరాడుతామని అని విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం రాజోలు శాసనసభ్యులు రాపాక వరప్రసాద రావు కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మీ సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి AFDT విద్యాసంస్థల పరిరక్షణ సమితి నాయకులు దేవ రాజేంద్రప్రసాద్, రాపాక మహేష్, పోలిశెట్టి గణేష్ ,తాడి సహదేవ్, తాడి రవీంద్ర, నక్క సంజయ్, జిల్లెల్ల ఉదయ్ కిరణ్, శశి ,ఐశ్వర్య, జ్యోతి తదితరులు నాయకత్వం వహించారు.
[zombify_post]