Minister Indrakaran Reddy | నిర్మల్ జిల్లాలో దూసుకెళ్తున్న కారు..బీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు
నిర్మల్, సెప్టెంబర్ 7: జిల్లాలో కారు దూసుకెళ్తున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా నిర్మల్ రూరల్ మండలం న్యూ పోచంపహాడ్ గ్రామానికి చెందిన 40 మంది, దిలావర్‌పూర్ మండలానికి చెందిన 30 మంది, నర్సాపూర్ మండలానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, లక్ష్మణచాంద మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన పలువురు నేతలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ గూటికి చేరారు.
అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘాలకు చెందిన పలువురు మంత్రి అటవీ, పర్యావరణ శాఖ మంత్ర ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అద్భుతమైన పథకాలు అమలుచేస్తున్నారని, దళితబంధు, బీసీ బంధు, మైనార్టీలకు ఆర్థిక సహాయం రైతు రుణమాఫీతో ఇతర పార్టీలకు చెందిన వారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు.
పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి
రాష్ట్ర సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామన్నారు. ప్రతిపక్ష నాయకులు పభుత్వ పథకాలు, సంక్షేమం చూసి తట్టుకోలేక అధికార పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపు కుంటున్నారని మండిపడ్డారు. ప్రజలు వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని, మోసపూరిత నాయకుల మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని పేర్కొన్నారు. కలిసికట్టుగా పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. Indrakaran Reddy Allola
[zombify_post]