ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలో రోజురోజుకూ విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇది వరకు భారీగా వర్షాలు కురిసి మధ్యలో తగ్గుముఖం పట్టాయి. తర్వాత ఎండలు మండిపోయాయి. ప్రస్తుతం కొన్ని రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకొని మళ్లీ వర్షాలు ప్రారంభం అయ్యాయి. దీంతో జ్వరాల తీవ్రత పెరిగిపోతోంది. మండలంలో దాదాపు ప్రతి ఇంట్లో ఒకరిద్దరు బాధితులు ఉంటున్నారు. ప్రధానంగా చిన్నారులు ఎక్కువ మంది వీటి బారిన పడుతున్నారు. వాతవరణ మార్పులతో జనం జ్వరాల బారిన పడుతున్నారు. 15 రోజుల నుంచీ అస్పత్రుల్లో రోగుల సంఖ్య భారీగా కన్పిస్తోంది. టైఫాయిడ్, మలేరియా, డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి. డెంగీ కేసులూ నమోదవుతున్నాయి. వర్షాలు, ఎండలు, కలుషిత నీరు తాగడం, దోమకాటు ఇలా పలు కారణాలతో వ్యాధులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. జ్వర బాధితుల్లో పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంటిల్లి పాది జ్వరాల బారినపడుతున్నారు. సర్కారు దవాఖనాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. విష జ్వరాలు వణికిస్తుండడంతో వైద్య,ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. విష జ్వరాలను కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. విషజ్వరాలపై అవగాహన కల్పించడంతోపాటు జ్వరాల బారిన పడిన వారిన గుర్తించి, వారికి వెంటనే వైద్య సదుపాయం అందిస్తున్నారు. ఆశా వర్కర్లు ద్వారా సాధారణ జ్వరాలు వచ్చిన వారిని గుర్తించి ఇంటి వద్దే మందులు అందించనున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ మొదలగు వ్యాధుల భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇంటి చుట్టు ప్రక్కల నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాడిన కొబ్బరి బొండాలను దూరంగా పడేయ్యాలని కాచి చల్లార్చిన నీటిని తాగడంతో పాటు వేడివేడి ఆహార పదార్థాలను తీసుకోవాలని ఏ మాత్రం అలసట అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని వైద్య అధికారి తెలిపారు. రక్తంలో ప్లేట్ లెట్స్ తగ్గితే భయపడకుండా ఆర్ఎంపీల దగ్గరకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా ఆసుపత్రికి వచ్చి తగిన వైద్యం చేసుకోవాల్సిందిగా సూచించారు.
[zombify_post]