•విద్యావంతుల తయారీలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది
•విద్యారంగంలో పెను మార్పులు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్ దే
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండంలో ఉపాధ్యాయులు కృషి ఎంతో ఉందని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి కొనియాడారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమమునకు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, డిఈఒ రమేష్ కుమార్ లతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమమును ప్రారంభించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్య నేర్పే గురువులకు చైర్ పర్సన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన (35) మంది ఉపాధ్యాయులను సన్మానించారు.జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి మాట్లాడుతూ శిష్యుల ఉన్నతి నీ కోరుకునే గొప్ప వ్యక్తులు ఉపాధ్యాయులు అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, భవిష్యత్తును ఇచ్చేది గురువేనని పేర్కొన్నారు. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు గురుతర భాధ్యతను నిర్వహిస్తున్నారని ఆమె అన్నారు.సిఎం కేసిఆర్ నేతృత్వంలో విద్యా రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఉండగా వేలాది మంది విద్యను అభ్యసిస్తూ లబ్ధి పొందుతున్నారని అన్నారు. విద్యారంగంలో కొత్త శకం ఆవిష్కృతం అవుతుందన్నారు. గురుకుల విద్యలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, నాణ్యమైన విద్యను అందిస్తూ రేపటి తరాన్ని తీర్చిదిద్దడంలో ముందంజలో ఉందని తెలిపారు. గుణాత్మక విద్యను అందిస్తూ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ సత్ఫలితాలను ఇస్తున్నదన్నారు.అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ జాతీ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది అన్నారు. గురు బ్రహ్మ,గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః,మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ" అనే సూక్తి తల్లిదండ్రులు తర్వాత గురువుకున్న ప్రాధాన్యతను తెలియ చేస్తుందన్నారు.విద్య ప్రాధాన్యతను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తుందన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలు, మరమ్మతుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం జరిగింది అని తెలిపారు. డ్యూయల్ డెస్క్ బెంచ్ లు, గ్రీన్ బోర్డులు, విద్యుదీకరణ, టాయిలెట్స్ నిర్మాణం, కిచెన్ గదుల నిర్మాణం, తాగునీటి ట్యాంకుల నిర్మాణం వంటి సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించడం జరుగుతుందని తెలిపారు.జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పుతూ, రేపటి పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఉత్తమ ఉపాధ్యాయులను స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజల మధ్య సన్మానించాలనీ విజ్ఞప్తి చేశారు.అనంతరం జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య మాట్లాడుతూ సర్వేపల్లి రాధ కృష్ణ బాటలోనే విద్యారంగంలో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టడమే కాకుండా పెను మార్పులు చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని అన్నారు. అన్ని వర్గాల పేద బిడ్డలకు కార్పొరేట్ విద్యను అందించాలన్న లక్ష్యంతో సిఎం కేసీఆర్ నెలకొల్పిన గురుకులాలు అద్భుత ఫలితాలు సాధిస్తూ దేశానికే రోల్ మోడల్ గా నిలిచాయని అన్నారు.అనంతరం జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ… సమాజాన్ని తీర్చిదిద్దే ప్రతి ఒక్కరూ గురువెనని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం తోపాటు, దేశానికి అవసరమైన ఉత్తమ పౌరులను తీర్చి దిద్దటంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఉపాధ్యాయులను గురు బ్రహ్మ,గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః పేర్కొంటూ త్రిమూర్తుల తో పోల్చారని…. ఉపాధ్యాయునికి ఇచ్చిన గొప్ప స్థానం ఇది తెలియజేస్తుందన్నారు.
[zombify_post]