అక్రమంగా కర్ణాటక మద్యం నిలువ ఉంచిన స్థావరాలపై ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు నిర్వహించారు.
కర్నూలు జిల్లా కౌతాళం మండలం హల్వి గ్రామంలో అక్రమంగా కర్ణాటక మద్యం నిలువ ఉంచి అమ్మకాలు నిర్వహిస్తున్న స్థావరంపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించరు. ఈ దాడుల్లో ఇద్దరినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 672 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సైదుల్ మీడియాతో మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు కురువ రాము, మెహబూబ్ భాష వారి ఇంటి ఆవరణంలో స్టాక్ పాయింట్లు నిల్వ ఉంచిన 7 బాక్స్లో కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ దాడుల్లో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సైదుల వారి సిబ్బందితో పాల్గొన్నట్లు తెలిపారు.
This post was created with our nice and easy submission form. Create your post!
