ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసిన… వెల్లాల మధుసూదనశర్మ
ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు పంజరాపోల్ కాలనీలో దీపం పథకముద్వారా మంజూరైన ఉచిత గ్యాస్ సిలిండర్లు, పొయ్యి, రెగ్యులేటర్లును ఈరోజు మధుసూదనశర్మ అర్హులైన మహిళలకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మధుసూదనశర్మ మాట్లాడుతూ ఎవరికైనా ఇంతవరకు రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు ద్వారా గ్యాస్ కనెక్షన్ లేకుండా ఉంటారో, అటువంటి వారందరు వాలెంటీర్ ద్వారా అప్లై చేసుకుంటే తప్పకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఏర్పాటు చేస్తానని మధుసూదనశర్మ తెలిపారు.కనుక ఈ అవకాశాన్ని గ్యాస్ కనెక్షన్ లేని ప్రతి పేద మహిళ ఉపయోగించుకోవాలని వార్డు ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో కురువ రవికుమార్, అబ్రహం, అగ్గి రాముడు,తిక్కన్న,సులోచనమ్మ,దీపమ్మ, వాలెంటీర్స్ మునిస్వామి, తిమ్మప్ప మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు…
This post was created with our nice and easy submission form. Create your post!