నిర్మాణం ఆలష్యం అయింది మన్నించండి… వైసిపి జిల్లా కార్యదర్శి.వెల్లాల మధుసూదనశర్మ…
మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల సందర్భంగా 35వ వార్డు పంజరాపోల్ కాలనీలో మహిళలు అడిగిన మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేసి వైసిపి కార్యదర్శి వెల్లాల మధుసూదనశర్మ కాలనీలోని మహిళలకు తాళాలు అప్పచెప్పారు. ఈ సందర్భంగా మధుసూదనశర్మ మాట్లాడుతూ……….. కౌన్సిలర్ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చినప్పుడు ఈ కాలనీ మహిళలందరూ ముఖ్యంగా మాకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బందులు పెడుతున్నామని, మీకు మేము అండగా ఉంటాము మీరు ఎన్నికల్లో గెలిచిన వెంటనే సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని కోరడం జరిగిందని, అప్పుడు ఇచ్ఛిన మాట ప్రకారం మా ఎమ్మెల్యే గౌరవనీయులు వై సాయిప్రసాద్ రెడ్డి గారి సహాయసహకారాలతో మరుగుదొడ్లు కట్టడానికి కౌన్సిల్ అనుమతి తీసుకుని ఏడు లక్షల ఎనభై వేల రూపాయలతో నిర్మాణం పూర్తి చేయగలిగాము అని మధుసూదనశర్మ తెలిపారు. అయితే పనులు ప్రారంభించి చాలా రోజులు అయినా నిర్మాణము చేయడములో కొంచెం ఆలష్యం జరిగిందని దయచేసి మా కాలనీ మహిళలందరూ మన్నించి రాబోయే 2014 ఎన్నికలలో కూడా ఆదోనిలో సాయిప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గెలిపించుకుంటేనే రాష్ట్రముతో పాటుగా ఆదోని అభివృద్ధి జరుగుతుందని మధుసూదనశర్మ ఈ సందర్భంగా వార్డు ప్రజలను వివరించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు రవికుమార్, అబ్రహం, అగ్గి రాముడు, తిక్కన్న, దీపమ్మ, సులోచనమ్మ, కాలనీ యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు….
This post was created with our nice and easy submission form. Create your post!