జూపూడి ప్రభాకర్ వెంటనే బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పాలి…… అధ్యక్షులు వెల్లాల మధుసూదన శర్మ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణులకు ఎమ్మెల్యే పదవుల నుండి గ్రామ స్థాయి సర్పంచుల వరకు వివిధ హోదాల్లో వివిధ పదవులను కట్టబెట్టి బ్రాహ్మణులకు విశేష ప్రాధాన్యత కల్పిస్తూ గౌరవిస్తుంటే నోటితుత్తర ఎక్కువైన జూపూడి ప్రభాకర్ లాంటి వారు బ్రాహ్మణులపైన ఇష్టమొచ్చినట్లు అవాకులు చవాకులు మాటాడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెల్లాల మధుసూదనశర్మ తెలిపారు.శుక్రవారం నెల్లూరు జిల్లా కావలి పట్టణములో వైఎస్సార్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికారిక బస్సు యాత్రలో జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ బాపనోళ్ళు మన పిల్లల కాళ్ళు పట్టుకుని చెప్పులు తొడిగించుకునే స్థాయికి మన ఎస్సీ ఎస్టీ కులాలను తీసుకొచ్చారని మాటాడి వైఎస్సార్ పార్టీకి తీవ్రంగా నష్టం కలిగించేలా జూపూడి మాట్లాడారని ఈ విషయాన్ని వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు గమనించి జూపూడి ప్రభాకర్ తో వెంటనే బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పించాలని మధుసూదనశర్మ డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యములో ఎవరు ఏదైనా మాట్లాడుకోవచ్చు విమర్శలు చేసుకోవచ్చు కానీ తమ కులాన్ని గొప్పగా చెప్పుకోవాలనే తాపత్రయములో ఎదుటి వారి కులాలను చులకన చేసి మాటాడే హక్కు జూపూడికి ఏం రాజ్యాంగం కల్పించిందో జూపూడి సమాధానం చెప్పాలని మధుసూదనశర్మ సూటిగా ప్రశ్నించారు.రాష్ట్రములో ఏం పార్టీ అధికారములో ఉంటే ఆ పార్టీలో చేరిపోయి పదవుల కోసం రాజకీయ వ్యభిచారం చేసే జూపూడి బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దర్నాలు, నిరసనలు చేస్తామని మధుసూదనశర్మ హెచ్చరించారు.
This post was created with our nice and easy submission form. Create your post!
