వి వో ఏ ల సమస్యలు పరిష్కరిస్తూ వి వో ఏ లకు అన్ని విధాల అండగా ఉంటాం
*ఏపీ వైయస్సార్ కాంతి పథకం వి వో ఏ ల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రభుదాస్
ఆదోని: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పనిచేస్తున్న వివోఏలకు అన్ని సమస్యలు పరిష్కరిస్తూ వారికి నిరంతరం అండగా ఉంటామని ఏపీ వైయస్సార్ కాంతి పథకం వివో ఏల యూనియన్ వ్యవస్థాపకులు ప్రభుదాస్ అన్నారు శనివారం స్థానిక వెలుగు కార్యాలయంలో జిల్లా వివో ఏ ల యూనియన్ కమిటీ సమావేశం జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి రవికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవస్థాపక అధ్యక్షులు ప్రభుదాస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు బసవరాజు లు మాట్లాడుతూ… వివో ఏ లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు హెచ్ఆర్ పాలసీ వర్తింపు కనీస వేతనం 26, వేలు ఇవ్వాలని సీనియర్ వివో ఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశామన్నారు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వివోఏలకు ప్రతినెలా గౌరవ వేతనం రావడం ఆశించదగ్గ విషయమని ఆయన కొనియాడారు. వైసీపీ పాలనలోనే వివో ఏల వ్యవస్థ పటిష్టం చెందిందని ఆయన అన్నారు. కొన్నిచోట్ల సాంకేతిక లోపం ద్వారా వివో ఏ లకు గౌరవ వేతనం రాకపోవడం బాధాకరం త్వరలోనే అందరికీ గౌరవ వేతన అందేలా చూసుకుంటామని వివోఏలకు హామీ ఇచ్చారు. అనంతరం నూతన జిల్లా కమిటీని ఏకీభవంగా ఎన్నుకున్నారు.కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆరెకల్ రవికుమార్ ఉప అధ్యక్షులుగా మిన్నల్ల తో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కోశాధికారి పద్మావతి కడప జిల్లా కార్యదర్శి నాగరాజు.కర్నూలు జిల్లా గౌరవ సలహా దారు రామలింగప్ప అయా మండల అధ్యక్షులు కార్యదర్శులు లోక్ నాథ్ రెడ్డి విజయ భాస్కర్ బాలస్వామి తిక్కన్న వరలక్ష్మి మౌలాలి వి వో ఏ లు తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!