డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం, బిళ్లకురు గ్రామంలో నక్కవారికాలనీ లో, జైభీమ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో యువత కి బహుజన సమాజ్ పార్టీ కొత్తపేట మండల అధ్యక్షులు యలమంచిలి ప్రసాద్ అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సాకా రాజారావు, కొత్తపేట నియోజకవర్గ అధ్యక్షులు గుర్రపు కొత్తియ్య ఓటు హక్కు గురించి,రాజ్యాధికారం గురించి,ఓటు శాతం గురించి, పూలే, అంబేద్కర్, కాన్సీరామ్ మరియు మహనీయుల ఆశయాలు, సిద్ధాంతాలు గురించి తెలియజేశారు.ఓట్లు మావి సీట్లు కూడా మివే అనుకుంటున్నారు ఇకపై చెలదు ఓట్లు మావే సీట్లు మావే అని అన్నారు.అక్కడ వున్న ప్రజలు మనకు రాజ్యాధికారం కావాలి అనే ఆలోచనతో మరికొందరు గునిపే అర్జున్ రావు, దాసు, పినమల సురేష్, గిడ్డి శ్రీనివాస్, సాకా ఆనంద్, యళ్ల నాగేంద్ర, యడ్ల సునీల్ యువకులు బహుజన సమాజ పార్టీ లో 12 మంది చేరారు..వీరందరూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోరిన బహుజన రాజ్యాధికారం కోసం ప్రయత్నాలు చేద్దాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, నియోజకవర్గ కన్వీనర్ కాండ్రు వెంకటేష్, నియోజకవర్గ ట్రెజరర్ కాండ్రేగుల గంగరాజు, ముఖ్య సలహాదారు నాయకులు యలమంచిలి రమేష్ బాబు, పెద్దలు,మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!