ఆదోని నియోజకవర్గంలో “గడప గడపకు మన ప్రభుత్వం,” కార్యక్రమం మున్సిపల్ పరిధి 38 వ వార్డ్ నిజాముద్దీన్ కాలనీ హనుమాన్ నగర్ ఏరియా లో (1వ రోజు లో భాగంగా) ప్రతి ఇంటి గడప ప్రజలతో మాట్లాడుతూ ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి తనయుడు వైయస్సార్ పార్టీ ఇంచార్జ్ యువనేత జయ మనోజ్ రెడ్డి గారు 450 గృహాలను సందర్శించి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొనుటకు తిరుగుతూ నవరత్నాలు ప్రజలకు అందుతున్నాయా లేదా మీ యొక్క సమస్యలు ఏమిటి? ఇక్కడ మంచినీరు, వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్లు సమస్యలు ఉన్నాయా? లేదా తిరుగుతూ అడగడం జరిగింది ఉన్న ప్రతి ఇంటికి మూడు లక్షల వరకు లబ్ధి చేకూర్చడం జరిగింది, ఈరోజు ప్రజల వద్దకే సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటరీ ద్వారా ఇంటి దగ్గరకే అందిస్తున్నారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు విద్య, వైద్యం పై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తున్నారు. గురువారం జగనన్న నేతన్న నేస్తం ద్వారా రూ.24,000/- డబ్బులు సంక్షేమ పథకాల ద్వారా అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం. ఈ వార్డ్ సచివాలయం నిధులు ద్వారా రూ. 20 లక్షలతో 30 కల్వర్టు డ్రైనేజీ కాలువలు పూర్తి చేయడం జరిగింది. ఈ వార్డులో రూ.15 లక్షలతో సి.సి.రోడ్లు వేయడం జరిగింది ఎరుకల కాలనీలో మహిళలకు రూ.16 లక్షలతో రెండు మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. కావున ప్రజలు ఆలోచించి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి ని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని వార్డ్ ప్రజలను కోరడం జరిగింది వార్డులో అలాగే జగనన్న కాలనీలో పట్టాలు నిరుపేదలకు పట్టాలు అందించడం జరిగింది వార్డులో ఎలాంటి సమస్యలు లేవు. చిన్నపాటి సమస్యలు మురికి కాలువలను శానిటేషన్ వర్కర్స్ తో పూడికను తీసివేస్తామని చెప్పడం జరిగింది. వార్డులో అన్ని సమస్యలను తెలుసుకుని తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. జనవరిలో వివిధ రకాల పెన్షన్లకు రూ.3000/- పెంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ ఎరుకల లక్ష్మి, మున్సిపల్ చైర్ పర్సన్ బోయ శాంత, వైస్ చైర్మన్ నరసింహులు, వీరసేవ లింగాయత్ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్స్ మంజుల, స్టేట్ పోలీస్ హౌసింగ్ డైరెక్టర్ రేణుక , అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, మున్సిపల్ అధికారులు కృపాకర్ పట్టణ అధ్యక్షుడు దేవా ,వైయస్సార్ మహిళా నాయకురాలు శ్రీలక్ష్మి , అన్నపూర్ణమ్మ చిట్టెమ్మ శ్రీదేవి, వైఎస్ఆర్ సీనియర్ నాయకులు ఎరుకల ఈరన్న , అల్తాఫ్, లోకేష్, చిన్న అంజని, జిలాన్, సాహెద్,చిరంజీవి తిక్కన్న , నాగరాజు కౌన్సిలర్స్ రఘునాథరెడ్డి , సురేష్ , చలపతి చిన్న, చిన్న ఈరన్న సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!