*మునిసిపల్ ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలి… ~ ఎస్టీయూ*
ఆదోని పట్టణంలో ఎస్టీయూ సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేయించడం జరిగింది… ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సి.నాగరాజు,రాష్ట్ర పురపాలక కమిటీ సభ్యులు వి.రమేష్ నాయుడు, ఎస్టీయూ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ జి.వీరచంద్ర యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మునిసిపల్ ఉపాధ్యాయులు నూతన సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారం చేయాలని, మునిసిపల్ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్, అర్బన్ విద్యాధికారి, డిప్యూటీ డీఈఓ పదోన్నతులు కల్పించాలని,అలాగే మునిసిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టాలని,కొన్ని మున్సిపాలిటీ లో పెండింగులో ఉన్న అరియర్స్ బిల్లులు కోసం కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్ క్రియట్ చేయాలని,మునిసిపల్ ఉపాధ్యాయులకు జిపిఎఫ్ సౌకర్యం ప్రారంభించాలని,ఇంకా చాలా మున్సిపాలిటీ లో 84 జీఓ వచ్చి స్కూల్ ఎడ్యుకేషన్ లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఉపాధ్యాయులు జీతాలు రాలేదు అని వెంటనే సమస్య పరిష్కరించి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేసారు…ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు గురుస్వామి,శ్రీనివాసులు, భీమరాజు, భాస్కర్ ఆచారి, చంద్ర శేఖర్ జయరాం, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు…
This post was created with our nice and easy submission form. Create your post!
