12/10/2023, ఆదోని
*రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి!. ~ PDSO డిమాండ్*
ఆదోని పట్టణంలో భీమస్ నందు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO) ఆదోని డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పిడిఎస్ఓ రాష్ట్ర నాయకులు కె.తిరుమలేష్ మాట్లాడుతూ…. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2,35,794 ఉద్యోగాలను భర్తీ చేయాలి. గతంలో ఎన్నికల లబ్దికోసం ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ,పోలీస్ వార్షికోత్సవ ఉత్సవాల్లో పోలీస్ పోస్టులు భర్తీ చేస్తామని, హామీలను గుర్తించి నిరుద్యోగుల ఓట్లను మలుచుకొని గద్దెక్కిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేయకుండా కేవలం సచివాలయం ఉద్యోగాల తోనే ప్రభుత్వ వ్యవహారాలన్నీ నడిపిస్తున్నాడు తప్ప మెగా డీఎస్సీ లేదు పోలీస్ ఉద్యోగాలు లేవు గ్రూప్ వన్, గ్రూప్ టు లాంటి ఉద్యోగాలు కూడా లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల పైబడి నిరుద్యోగులు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారని .జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా నూతన జాబ్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఇప్పటికి కూడా కేవలం ఒక్కసారి మాత్రమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అందులో డీఎస్సీ టీచర్ పోస్టులు పెట్టకపోవడం దారుణమని ,ఉద్యోగాలు కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు ఆశలు అడియాశలు అయిన సందర్భంగా ఈ జిల్లాలో కొంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని. వారు గుర్తు చేశారు అంతేకాకుండా ఉద్యోగస్తులకు మరో రెండేళ్లు వయోపరిమితి పెంచి నిరుద్యోగుల జీవితాలతో చలగాటమాడుతున్నారని కాబట్టి జగన్ మోహన్ రెడ్డి తక్షణమే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగుల వయోపరిమితిని పెంచాలని లేనిపక్షంలో నిరుద్యోగులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉదృతంగా మలిచి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని వారు హెచ్చరించారు. పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, శివ మహిళా సెల్ కన్వీనర్స్ నికిత, కృష్ణ వేణి, శ్రావణి ముఖ్య కార్యకర్తలు మోహన్ ,హరి, రవీంద్ర ,ప్రవీణ్ ,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!