*యాంటీ ర్యాగింగ్ మరియు విద్యార్థుల ఆత్మహత్యల నివారణ పట్ల అవగాహన సదస్సు*.
ఆదోని పట్టణంలోని సాయి డిగ్రీ కళాశాలలో రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్(RPSF) ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ మరియు విద్యార్థుల ఆత్మహత్యల నివారణ పట్ల అవగహన సదస్సులో ముఖ్య అతిథులుగా సైకాలజిస్ట్ డాక్టర్ వెంకటసుబ్బయ్య గారు,స్త్రీ విముక్తి మహిళా సంఘం అధ్యక్షురాలు సుజ్ఞానమ్మ,లోకేష్,కళాశాల ప్రిన్సిపాల్ జనార్దన్, ప్రసాద్ గారు పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ ర్యాగింగ్ చేయడం అనేది మంచి విద్యార్థి లక్షణం కాదని,ర్యాగింగ్ చేయడం వల్ల ఎదుటివారు మానసికంగా చాలా ఇబ్బందులు పడతారని,అదే విధంగా ర్యాగింగ్ చేయడం వల్ల చట్టపరమైన సమస్యలు ఎదుర్కొని ర్యాగింగ్ చేసిన విద్యార్థులు కూడా ఇబ్బందులకు గురవుతారని ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. భిన్న ప్రాంతాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసించడం కోసం ఇక్కడికి వచ్చారు కాబట్టి అందరూ ఒక కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలని తోటి విద్యార్థులను ఇబ్బంది పెట్టడం మానసికంగా ఒత్తిడికి గురి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అన్నారు ర్యాగింగ్ సంస్కృతి వల్ల ర్యాగింగ్ కు గురైన విద్యార్థి మానసిక వేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం దురదుష్టకరమని,తోటి విద్యార్థుల పట్ల నైతికత లేకుండా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని ఆవేదాం వ్యక్తం చేశారు.ఏ విద్యార్థి వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని,వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు.చట్టాలు బలోపేతం చేయబడ్డాయని,ర్యాగింగ్ పాల్పడితే ర్యాగింగ్ చట్ట ప్రకారం కఠినమైన శిక్షలు ఉంటాయని అన్నారు.సమస్యలు వస్తే పై అధికారులకు తెలియజేయాలని,సమస్యలని తలుచుకొని కుంగిపోవద్దని ధైర్యంగా ముందుకు సాగాలని కోరారు.ప్రతి ఒక్క విద్యార్థి ఇతరులకు ఆదర్శంగా ఉండాలని,తల్లిదండ్రుల కలలను,మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకోవాలని,కళాశాలకు,ప్రభుత్వానికీ మంచి పేరు తేవలన్నారు అలాగే ఇక్కడి నుండి వైద్యులుగా పట్టాలు పొంది సమాజానికి,పేదలకు సేవలు అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేష్(RPSF) రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్, జిల్లా కార్యదర్శి బాలు డివిజన్ నాయకులు విష్ణు,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!
