గరుగుబిల్లి మండల అభివృద్ధి అధికారి జి.పైడితల్లిపై రీజనల్ విజిలెన్స్ ఎస్పీకి ఇటీవల ఫిర్యాదు అందింది. ఈ మేరకు దీనిపై విచారణ చేపట్టాలని శ్రీకాకుళం రీజనల్ విజిలెన్స్ ఎస్పీ ఎ.సురేష్‌బాబు జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్‌కు లేఖ రాశారు గరుగుబిల్లి మండల అభివృద్ధి అధికారి జి.పైడితల్లిపై రీజనల్ విజిలెన్స్ ఎస్పీకి ఇటీవల ఫిర్యాదు అందింది. ఈ మేరకు దీనిపై విచారణ చేపట్టాలని శ్రీకాకుళం రీజనల్ విజిలెన్స్ ఎస్పీ ఎ.సురేష్‌బాబు జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్‌కు లేఖ రాశారు. విధుల్లో నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించి వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని లేఖలో వివరించారు. ఆమె పనితీరుతో పాటు వసూళ్లపై విచారణ చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌కు విచారణకు ఆదేశించారు. దీంతో జిల్లాయంత్రాంగం కొద్దిరోజులుగా మండలంలో విచారణ చేపడుతున్నారు.స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి శుక్రవారం వచ్చిన డివిజనల్ అభివృద్ధి అధికారి ఎన్.రమేష్‌రామన్‌ను ఈ విషయంపై వివరణ కోరగా… గరుగుబిల్లి ఎంపీడీవోపై విచారణ చేపట్టాలంటూ ఆదేశాలు అందాయన్నారు. డీఎల్‌డీవోగా తాను నూతనంగా బాధ్యతలు స్వీకరించానని, సిబ్బంది కొరత ఉందని తెలిపారు. కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లానని, ఆయన ఆదేశాల మేరకు విచారణకు సమయం కేటాయిస్తామని చెప్పారు. ఎంపీడీవోపై వచ్చిన ఆరోపణలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని, సంబంధిత సిబ్బంది సమక్షంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని ఆయన తెలిపారు.
This post was created with our nice and easy submission form. Create your post!