*విద్యార్థులకు చెడిపోయిన గుడ్లతో మధ్యాహ్న భోజనమా…*
*విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి*
స్థానిక ఆదోని పట్టణంలో గర్ల్స్, మున్సిపల్ పాఠశాలలో పిడిఎస్ఓ బృందం పాఠశాలలను సర్వే చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శివ ,అశోక్ మహిళా సెల్ కన్వీనర్స్ నికిత ,కృష్ణవేణి మాట్లాడుతూ….. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో కుళ్ళిన గుడ్లతో ఆహారం పెట్టి కడుపు నింపుతున్న పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నది. కుళ్ళిపోయిన గుడ్లను విద్యార్థులు దుర్వసన ఉన్నాయని చెప్పేసి వాటిని తినకుండా కొంతమంది విద్యార్థులు పాడేస్తున్నారు కావున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పైన ఇంత చిన్నచూప విద్యార్థులు అనారోగ్యాలకు గురి కావడం ప్రభుత్వానికి అంత ఇష్టమా ఒక్కసారిగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రతి క్లాసుకు సరైన ఉపాధ్యాయులు , మౌలిక సదుపాయాలు లేక అనేక రకాలుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉన్నది అని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ అధికారులను మరియు ప్రభుత్వాన్ని కోరడమైనది లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేపడతామని హెచ్చరిస్తున్నాం.

This post was created with our nice and easy submission form. Create your post!