మహిళలపై నోటికొచ్చినట్లు మాట్లాడే దృష్ట సంస్కృతికి తెరలేపిందే మంత్రి ఆర్కే రోజానే అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అని ఆరోపించారు.టీడీపీ నేతలు ఏదో అన్నారని రోజా కంట తడిపెట్టారు..ఇలాంటి కంటతడిలు తాము ఎన్నోసార్లు పెట్టామని అన్నారు. వంగలపూడి అనిత బుధవారం మీడియాతో మాట్లాడారు. మరి మగవాళ్ల గురించి రోజా నోటికొచ్చినట్లు మాట్లాడొచ్చా? అని నిలదీశారు. దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా తన గురించి రోజా అసభ్యంగా మాట్లాడారు అని గుర్తు చేశారు. మాజీమంత్రి పీతల సుజాతను బాడీ షేమింగ్ చేసింది రోజా కాదా? అని నిలదీశారు. ఆరోజు ఆడతనం, మహిళ అన్న అంశాలు రోజాకు గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. ఇవాళ రోజా నీతులు మాట్లాడుతుంటే ఏమనుకోవాలి? అని ప్రశ్నించారు. టీడీపీ మహిళా నేతలపై అసభ్యంగా మాట్లాడితే వారిపై కేసులు ఉండవా? మా ఫిర్యాదులపై ఇప్పటివరకు విచారణ జరగలేదు అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు.
This post was created with our nice and easy submission form. Create your post!