in ,

జగదాంబ కూడలి అభివృద్ధి పనులకు నగర మేయర్ శంకుస్థాపన

 విశాఖపట్నం అక్టోబర్ 04:- నగర సుందరీకరణలో భాగంగా కూడళ్ళ అభివృద్ధి చేస్తున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. బుధవారం ఆమె నాలుగవ జోన్ పరిధిలోని జగదాంబ కూడలి అభివృద్ధి పనులకు పార్లమెంటు సభ్యులు ఎం వి వి సత్యనారాయణ, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

 ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నగర సుందరీకరణలో భాగంగా కూడళ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. జగదంబ కూడలితోపాటు క్లాక్ టవర్ నిర్మాణానికి స్మార్ట్ సిటీ నిధులతో 2.3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ నగర అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. నగరంలో రద్దీ దృశ్య జంక్షన్ల అభివృద్ధితోపాటు రోడ్ల విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా జగదాంబ నుండి పాత పోస్ట్ ఆఫీస్ వరకు  రోడ్డు విస్తరణ పనులను చేపట్టామన్నారు.

 తదుపరి పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ విశాఖ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పాటు కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సుందర విశాఖ నగరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టి ఆ దిశగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

 అనంతరం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సాధ్యంలో విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని అవుతున్న దృశ్య అందుకు తగిన విధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే  బస్ భె, కూడళ్ళ అభివృద్ధి, రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని తెలిపారు.

 ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉరుకూటి నారాయణ, జోనల్ కమిషనర్ శివప్రసాద్, స్మార్ట్ సిటీ కార్యనిర్వాహక ఇంజనీరు, ఇతర జీవీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

బండారు వ్యాఖ్యలపై కంటతడి పెట్టిన మంత్రి రోజా

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు 96వ జయంతి సదర్భంగా అన్నదానం