డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ) జాతీయ రహదారులలో ఐదు లేక ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి బ్లాక్ స్పాట్లుగా నిర్ధారించి ప్రమాదాలు నివారణ కొరకు చర్యలు గైకొనడం జరుగు తుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లాలో రహదారులు వెంబడి ప్రమాదాలు పొంచియున్న 53 ప్రాంతాలను ఇప్పటివరకు గుర్తించారని వీటిలో స్థానిక ఎస్ కే బి ఆర్ కళాశాల వద్ద ఎత్తు రోడ్డు వద్ద మహిపాల్ చెరువు వద్ద రావులపాలెం జూనియర్ కళాశాల వద్ద రావులపాలెం బస్టాండ్ వద్ద ఈతకోట వద్ద నగరం జంక్షన్ వద్ద తదితర ప్రాంతాలను బ్లాక్ స్పాట్లు గా గుర్తించడం జరిగిందన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కోటిపల్లి- యానాo ఏటిగట్టు పైలెట్ ప్రాజెక్ట్ గూర్చి కమిటీ సభ్యులకు విశదీకరించారు.ఈ పైలెట్ ప్రాజెక్టు లో ప్రమాదాలు జరగడానికి గల కారణాలను అన్వేషించారని వీటిలో ప్రధానంగా గుంతలు తుప్పలు, ఉండడంతోపాటుగా రెలింగ్ హెచ్చరిక బోర్డులు,స్పీడ్ బ్రేకర్లు బెర్ములు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి సంబంధిత శాఖలకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు అదేవి ధంగా జిల్లాలో మిగిలిన రోడ్లు లో జరుగుతున్న ప్రమాదాల బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణ కొరకు పటిష్టమైన చర్యలు గైకొనడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. తరచుగా ప్రమా దాలు జరుగుతున్న జాతీయ రహదారిలో ఆలమూరు జొన్నాడ ఈతకోట, మరియు ఐ పోలవరం- అమలాపురం ప్రమాదాలు నివా రణకు పటిష్టమైన చర్యలు గైకొన డం జరుగుతుందన్నారు. జొన్నాడ బ్రిడ్జిపై లైటింగ్ ఏర్పాట్లు చేయాలని బ్లాక్ స్పాట్లు వివరాలు పొందుపరిచి ఆయా శాఖల అధికారులకు తగు చర్యలు నిమిత్తం సమర్పించాల న్నారు. అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ సిస్టం వాహనాలు నూతనంగా అందుబా టులో తేవాలని జాతీయ రహదా రుల అధికారులకు సూచించారు. ప్రమాదాలు జరిగిన సందర్భంలో దగ్గర్లోని ఆసుపత్రులకు వెళ్లేందుకు వివరాలు తెలుపుతూ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. 18 సంవత్సరాల లోపు పిల్లలు ద్విచక్ర వాహనాలు నడపరాదని సూచించారు. అమలాపురం పురవీధులలో పశువులు కుక్కలు సంచారాన్ని రాత్రి వేళల్లో నిలుపు దల చేయాలని లేని పక్షంలో ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిని కట్టడి చేయా లని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఆలమూరు కొత్తపేటలలో ట్రామా కేర్ కేంద్రాలు ఏర్పాటు కు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పాఠశాలలో కళాశాలలో రోడ్ సేఫ్టీ క్లబ్బులు ప్రధానోపాధ్యాయులు సాంఘిక టీచర్ల సమన్వ యంతో క్లబ్లో మెంబర్లుగా 20 మంది విద్యార్థిని విద్యార్థులను ఎంపిక చేస్తూ రహదారి భద్రతా నియమా లపై అవగాహన పెంపొందించాలని ఆదేశించారు. తద్వారా విద్యార్థిని విద్యార్థులు రహదారి భద్రత నియ మాలపై అవగాహన పెంపొందించు కొని రోడ్లపై సురక్షితంగా పయనించా లన్నారు. రహదారి భద్రత నిబంధ నలను పాదచారులు వాహనదా రులు తప్పనిసరిగా పాటించాలని నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే రోడ్లపై వెళ్లే తోటి ప్రయాణికులు కూడా ప్రమాదాలు బారిన పడే అవకాశం పొంచియున్నదన్నారు. జిల్లా ఎస్పీ ఎస్. శ్రీధర్ మాట్లాడుతూ సెల్ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం కారులో పయనించేవారు సీటు బెల్టులు ధరించకపోవడం వంటి చర్యలు రహదారి భద్రతా నియమాలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు రహదారి నియమాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకొని తప్పనిసరిగా పాటించాలన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను పాదచారు లుగా భవిష్యత్తులో వాహనదారు లుగా తీర్చిదిద్దేందుకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో జాతీయ రహదారుల పథక సంచాలకులు బి సురేంద్రనాథ్ బి సాయి శ్రీనివాస్ ఆర్డీవోలు ఎం ముక్కంటి, వసంత రాయుడు డిటిఓ అశోక్ ప్రతాప్ రావు, మున్సిపల్ కమిషనర్లు విఐపి నాయుడు, కే శ్రీకాంత్ రెడ్డి, డిసిహెచ్ఎస్ పద్మశ్రీ రాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం దుర్గారావు దొర, రవాణా శాఖ అధికారులు పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!